
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన పీడీ కొన్ని రాజిరెడ్డికి పట్టణానికి చెందిన సిద్ధార్థనగర్ అసోసియేషన్ వారు రాజిరెడ్డి దంపతులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సాగి వీరభద్రరావు మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ ఉద్యోగానికే కానీ ప్రజాసేవకు కాదని అన్నారు. ఆదర్శ ప్రాయమైన వ్యక్తులు ఎల్లప్పుడు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ వారి కష్టసుఖాలతో మమేకమైతూ ముందుకు పోతారని అన్నారు. ఇందుకు గాను పిడి రాజిరెడ్డి ఉదాహరణగా చెప్పవచ్చని అన్నారు. కౌన్సిలర్ స్వరూప ముత్యంరావు మాట్లాడుతూ ఐకమత్యమే దేశానికి బలమని అన్నారు.
సిద్ధార్థనగర్ కాలనీవాసులు ఐకమత్యంగా ఉంటూ ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నారని, ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. పిడి రాజిరెడ్డి సేవలను కొనియాడారు. మత్యగిరీంద్రస్వామి ఆలయ సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బండ సంపత్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ రావు, తూము వెంకట్ రెడ్డి, ఈ లింగరావు, మాడ రాజిరెడ్డి, ఉమ్మడి రాజమౌలి, టీ సంపత్ రావు, బిల్డర్ శ్రీనివాసరావు, ఏం రాజిరెడ్డి, ఆర్ తిరుపతిరెడ్డి, కేశవరెడ్డి, బత్తుల మనోజ్, వర్షిత్ రెడ్డి, శివ ప్రసాద్ రావు, ఉపాధ్యాయురాల్లు రమాదేవి, పరిమళ, విజయతో పాటు వనజ, రజిత, రజిని, అరుణ, సరిత, ప్రసన్న, వినోద, మౌనిక తదితరులు పాల్గొన్నారు.







