
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథ కళాకారులకు వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రజా పాలనకు హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటానికి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం సారథి కళాకారులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులకు గత ప్రభుత్వం 583 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి స్వరాష్ట్రంలో తగిన గౌరవం అందించిందన్నారు. గత పది సంవత్సరాల నుండి రూ. 24,514 రూపాయల గౌరవ వేతనం ఇచ్చి వారికి తగిన స్థానాన్ని ఇచ్చిందనీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటే ఏమిటో నిరూపించుకుందన్నారు. 583 మంది కళాకారులకు పిఆర్సి పెంచి రూ. 24,514 ఉన్న జీతాన్ని 31,868 రూపాయలకు పెంచి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపిందనీ, కళాకారులకు సముచిత స్థానాన్ని ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మరియు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క కి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి, కరీంనగర్ కు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాలాభిషేకంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు కరీంనగర్ జిల్లాకు చెందిన వడ్లకొండ అనిల్ కుమార్, గర్జన, శనిగరం బాబ్జి, ఎండి రహీం, తుమ్మనపల్లి రాజు, ఎర్ర సురేష్, పుల్లా శ్రావణ్ కుమార్, మహాదేవుని శ్రీధర్, ఆవునూరి కోమల, పుల్ల వెంకన్న, ఎండి నిజాముద్దీన్, రావుల తిరుపతి, కొంకట తిరుపతి, పద్మ, మోరే సంపత్, వేల్పుల విజేందర్, దొగ్గల శ్రీధర్, జీడి సుధాకర్ తదితర ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు.







