
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డులో మంగళవారం డ్రై డే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గోలాలల్లో, కొబ్బరి బోండాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోసి దోమలు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. నిల్వ ఉన్న నీటిలో లార్వా పేరుకు పోయి డెంగ్యూ దోమ వృద్ధి చెందుతుందని తద్వారా ప్రాణాపాయం సంభవిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పురపాలక సంఘము 3వ వార్డు కౌన్సిలర్ మక్కపల్లి కుమారస్వామి, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జరీనా, మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ ఏం కిషన్ రావు, సానిటరీ జవాన్లు ప్రతాప రాజు, ఆరేల్లి రమేష్, అనిల్, సుధీర్, కుమారస్వామి, వార్డు ప్రత్యేక అధికారి, ఆశా వర్కర్లు, మెప్మా ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.







