మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని సీరిసేడు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు నాగపురి
సంతోష్ గౌడ్ (30) వృత్తిరీత్యా ఈ నెల 18 వ తేదీన తాటి చెట్టు ఎక్కి ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని ఈ రోజు సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ సంఘము రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు జక్కే వీరస్వామిగౌడ్, సంగం నాయకులు సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భముగా రాష్ట అద్యక్షులు జక్కేవీరస్వామిగౌడ్ మాట్లాడుతు.. నిరుపేద గీతా కార్మికుడైన నాగపురి సంతోష్ గౌడ్ కు ఇద్దరు చిన్నపిల్లలని సొంత ఇల్లుకుడా లేదని ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని వీరస్వామిగౌడ్ కోరారు. త్వరగా కాటమయ్య రక్షణ కావచలు అందించి గీతా కార్మికుల ప్రాణాలు కాపాడాలని వీరస్వామిగౌడ్ అన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రమాద మరియు చనిపోయిన గీతా కార్మికులకు ఎక్సగ్రేషియా అందక ఎదిరిచూస్తాన్నారని త్వరగా ఎక్సగ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గీతా కార్మికులను చిన్న చూపు చూస్తున్నదని సంఘము నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు గండి రంజిత్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు బొమ్మిడి గణపతిరాజ్ గౌడ్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి ముంజాల కుమార్ గౌడ్ పాల్గోన్నారు.