
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : మహిళలు, యువతులు నిరంతరం సమాజంలో అప్రమత్తంగా నడుచుకోవాలనీ హుజురాబాద్ టౌన్ సిఐ బొల్లం రమేష్ పేర్కొన్నారు. మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీలో బుధవారం బాలికల మీద అత్యాచారాలు మరియు అక్రమ రవాణా పైన మై ఛాయిస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో డార్కస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ సిఐ బొల్లం రమేష్ హాజరై మాట్లాడుతూ.. ఈ రోజుల్లో బాలికల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ఎన్నో అవాంఛనీయ సంఘటనలు విద్యార్థినిలకు వివరించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుడ్ టచ్ అండ్ బ్యాక్ టచ్ పైన మరియు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 పైన అవగాహన కల్పించారు. డార్కస్ ఆర్గనైజేషన్ ఆలేటి సుధాకర్ మాట్లాడుతూ… బాల్యవివాహాలు, లింగ నిర్ధారణ చేసి బృణ హత్యలు చేయకుండా నిరోధించాలన్నారు. ఈ సందర్భంగా 360 మంది పిల్లలకు గ్రామ జ్యోతి పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాగమని, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సూర్యోదయ సంస్థ ప్రెసిడెంట్ ఏం రాధిక తదితరులు పాల్గొన్నారు.






