
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగే సామాజిక చైతన్య దీక్షలు పోస్టర్ ను బుధవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. మాలల హక్కుల సాధన కోసం నిర్వహించే సామాజిక చైతన్య దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కాడే శంకర్, స్వామి,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి తాళ్ల వెంకన్న, మాల మహానాడు నాయకులు సొల్లు బాబు, ముద్ద మాల లక్ష్మి, పసుల స్వామి, వేముల పుష్పలత, సొల్లు సునీత, కొండ్ర మమత, జక్కుల బాబు, గూడ కిష్టయ్య, జూపాక శ్రీను, కోడెం నర్సింగ్, సందెల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






