Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు తలపాక లావణ్య (బ్లైండ్ )షరాఫ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ హుజురాబాద్ ఆర్థిక సహాయంతో ఉచిత బస్సు పాసులను అందజేశారు. ఈ బస్సు పాసులను హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ వి రవీంద్రనాథ్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డిఎం శోభారాణి చేతుల మీదుగా అందజేశారు. తాను దాతల సహాయంతో ఉన్నత చదువులు చదివి నేడు ఈ స్థాయికి చేరుకున్నారని నాలాగే విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివి నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే స్థాయికి ఎదగాలని ఉద్దేశంతోనే పేద పిల్లలకు తన జీతంలోనీ డబ్బులు చెల్లించి ఉచిత బస్సు పాసులను అందజేయడం జరిగిందని తలపాక లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగి వేల్పుల ప్రభాకర్, సి ఆర్ పి అమరేందర్ మరియు ఉపాధ్యాయులు టి పవన్ కుమార్, పి ఈశ్వర్ రెడ్డి, సొల్లు సారయ్య, ఏ సమ్మయ్య, కే సదానందం తదితరులు పాల్గొన్నారు.







