మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హనుమకొండ: వేతన సవరణ, పెన్షన్ సవరణ మరియు హన్మకొండలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పెన్షనర్ ఉద్యోగుల సంఘం నాయకుడు మహమ్మద్ మక్బూల్ హుస్సేన్ వరంగల్ ఎంపీ కడియం కావ్యను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై చాలాసేపు ఆమెను కలిసి చర్చించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ 2024 వరకు ఏర్పాటు చేయాలని కోరగా ఆమె ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లి ఏర్పాటు చేసేలా కృషి చేశారన్నారు. దీంతో వరంగల్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ అదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు ఇది ఎంతగానో సౌకర్యవంతంగా వెల్నెస్ సెంటర్ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ స్పందించి హనుమకొండలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలకు పూనుకుందన్నారు. వసతి గూడా ఫైనల్ గా అధికారులు వచ్చి చూసి వెళ్లారని, ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్, ఎక్స్ సర్వీస్ మెన్ చాలామంది పెన్షనర్స్ ఉన్నారన్నారు. వీరు ప్రతినెల హైదరాబాద్ కు వెళ్లడం జరుగుతుందని, రాను పోను రూ.1200 వరకు ఖర్చు జరుగుతుందని, దీని విషయమై అధికారులకు కలసి విన్నపం చేయగా తప్పకుండా హన్మకొండలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తారని తెలంగాణ రాష్ట్ర బిఎస్ఎన్ఎల్ సర్కిల్ సెక్రటరీ సంపత్ రావు తెలిపారని మక్బూల్ హుస్సేన్ తెలిపారు. హనుమకొండలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసేలా కృషి చేసిన ఎంపీ కడియం కావ్యకు కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
- Home
- హనుమకొండలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయండి!.