
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ న్యాయవాది శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన బాణాల శ్యామసుందర్ చారీ గుండె పోటుతో ఆదివారం తెల్లవారుజామున హుజురాబాద్ పట్టణంలోని తన స్వగృహం వద్ద ఆకస్మికంగా మృతి చెందారు. హుజురాబాద్ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తూనే జర్నలిస్టుగా కూడా రాణిస్తున్నారు. శనివారం హుజురాబాద్ కోర్టులను, సబ్ జైలును జిల్లా జడ్జిలు తనిఖీ చేయగా వారితో పాటు నాల్గంతస్తుల మేరా మెట్ల ద్వారా చురుగ్గానే తనిఖీలో పాల్గోని పత్రికలకు తనవంతుగా పత్రిక ప్రకటన జారీ చేశారు కూడా. ప్రజాప్రతినిధులతో జడ్జిలతో , న్యాయవాదులతో, పోలీసులతో, క్లైంట్లతో స్నేహితులతో సన్ని హితులతో, గ్రామ, మండల ప్రజలతో వారి క్లైంట్లతో కలవిడిగా ఉంటు న్యాయం అందిస్తు గుండెపోటుకు గురైన సంఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం. శ్యాంసుందర్ శంకరపట్నం మండలం పివి జిల్లా సాధన సమితి నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో ప్రజాసంఘాల నాయకుడిగా ఏనలేని సేవలందించారు. పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ సమాజ అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడేవాడు. ఆయన ఆకస్మిక మృతితో న్యాయస్థానం, సమాజం వారి కుటుంబం కూడ ఈరోజు ఆయన్ని కోల్పోయింది. ఆయన మృతి వార్త సోషల్ మీడియా ద్వారా దావణముల వ్యాపించడంతో హుజురాబాద్ బార్ ఆసోసియేషన్ నాయకులు, సభ్యులు పాత్రికేయులు మీడియా ప్రతినిధులు వివిధ ప్రాంతాల ప్రజా ప్రతినిధులు వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆయన అమృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ప్రముఖ న్యాయవాది, పాత్రికేయుడు బాణాల శ్యాం సుందర్ ఆకస్మిక మరణం బాధాకరం.
ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.
…………,…………………………………………….
ప్రముఖ సీనియర్ న్యాయవాది, పాత్రికేయుడు, తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, స్నేహశీలి బాణాల శ్యాం సుందర్ గుండెపోటుతో అదివారం ఉదయం అకాల మరణం చెందడం బాధాకరమని రైతు ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఆదివారం హుజురాబాద్ లో మృతుని కుటుంబ సభ్యులను రామారావు కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, మృత దేహం పై పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ న్యాయవాదిగా, పాత్రికేయుడిగా సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంలో శ్యాం సుందర్ విశేష సేవలందించారని, తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో హుజురాబాద్ పాత తాలూకా ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం కలిగించి ఉద్యమ స్ఫూర్తిని నింపారని కొనియాడారు. పాత్రికేయుడిగా సామాజిక రుగ్మతలతో తన కలం తో గళమెత్తి ప్రజల్లో అవగాహన కల్పించారని, మద్యపాన నిషేధ ఉద్యమంలో నాతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్నారని శ్యాం సుందర్ మృతి తీరని లోటని, స్నేహితుల దినోత్సవ రోజున మంచి మిత్రుడిని కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేస్తూ అశ్రు నివాళులు అర్పించారు.
————–+—————-
జర్నలిస్ట్ యూనియన్ నుండి ఆర్థిక సహాయం...
గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలో ఉన్న శ్యాంసుందర్ మృతి సందర్భంగా జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ తరపున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈనాడు, ఆంధ్రప్రభ, సూర్య, న్యాయపోరాటం పత్రికల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుతం న్యాయపోరాటం దినపత్రిక ఎడిటర్ గా కొనసాగుతున్నారు. శ్యాంసుందర్ మృత దేహాన్ని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన మృతి సమాజానికి తీరని లోటు అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రతినిత్యం పేద ప్రజల, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి ఎన్నో సేవలు అందించారని వారు గుర్తు చేశారు. ఆయన మృతి జర్నలిజం, న్యాయవాద రంగానికి తీరని లోటని వారన్నారు. నివాళులు ఆర్పించిన వారిలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్ కాయిత రాములు, సీనియర్ జర్నలిస్టులు మామిడి రవీందర్, కోరం సుధాకర్ రెడ్డి, తిరునగరి ఆంజనేయస్వామి, గడ్డం రాజిరెడ్డి, పరాంకుశం కిరణ్ కుమార్, మండల యాదగిరి, కేసిరెడ్డి నరసింహారెడ్డి, గడ్డం హర్షవర్ధన్, వేల్పుల సునీల్ కుమార్, పోతరాజ్ సంపత్, కుడిక్యాల సాయి, జిల్లా యూనియన్ నాయకులు మహేంద్ర చారి, సదానందం, కాల్వ కృష్ణ, ఏ తిరుపతి, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.







