
–అమెరికాలో ఉన్నత చదువుల కోసం 55 లక్షలు ఆర్థిక సాయం మంజూరు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.
–ప్రతిభ ఉన్న విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.
–రాష్ట్రంలో నలుగురు ఎంపిక కాగా హుజురాబాద్ వాసి ఉండడం గర్వకారణం.
–హుజురాబాద్ నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితల ప్రణవ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడని దానికి నిదర్శనం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావణి అని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అమెరికాలో ఉన్నత చదువు చదవడానికి విద్యార్థినికి 55 లక్షల ఆర్థిక సాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పేద విద్యార్థుల పట్ల ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని వారు అన్నారు.ఈ సందర్భంగా మోడల్ స్కూల్ లో చదివి అమెరికాలో సీటు పొందిన విద్యార్థినికి మామిడాలపల్లిలోని నివాసానికి వెళ్లి అభినందించారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తున్న సరస్వతీ పుత్రికకు అమెరికాలో ఉచితంగా మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ నుంచి అమెరికాలో ఉన్నత విద్య (మాస్టర్స్) అభ్యసించడానికి నలుగురు విద్యార్థులను ఫెలోషిప్తో ఎంపిక చేయగా, అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావని కూడా ఉన్నది. అమెరికాలోని అబరాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రెండేళ్లకు ప్రభుత్వం 55.50 లక్షలు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు ప్రకటించిన విషయం విధితమే కాగా అమెరికాలో ఉన్నద విద్య పూర్తి చేసి తెలంగాణ రైతులకు తాను నేర్చుకున్న విద్యను ఇక్కడ రైతులకు ఉపయోగపడేలా కృషి చేయాలని కోరారు రాష్ట్రంలో నలుగురు విద్యార్థులు ఎంపికగా అందులో హుజురాబాద్ వాసి ఉండడం గర్వకారణమని వారు అన్నారు. ఈ సందర్భంగా పావని తల్లిదండ్రులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.






