
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రజల కోసమే జీవించి ప్రజలకోసమే తపించి ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేసి ప్రజల వెంట నడిచిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తారీఖు నాడు మధ్యాహ్నం రెండు గంటల నుండి హైదరాబాదులోని రవీంద్రభారతిలో ప్రధమ వర్ధంతి సభ జరుగుతుందని తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కరీంనగర్ జిల్లా కన్వీనర్ శనిగరం బాబ్జీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, మేధావులు, కార్మిక, కర్షక, విధ్యార్థులు, ప్రజాస్వామ్య వాదులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం. చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కరీంనగర్ జిల్లా కన్వినర్ శనిగరం బాబ్జీ తో పాటు జిల్లా కో కన్వినర్ పుల్ల వెంకన్న పాల్గొన్నారు











