
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను కొన్ని గంటల్లోనే వెతికి పెట్టి బాధితునికి అప్పజెప్పి హుజురాబాద్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలో అనుప్ రాజు అనే యువకుడు జమ్మికుంట రోడ్డులోని అయ్యప్పస్వామి దేవాలయం దగ్గర తన ఫోన్ పోగొట్టుకోగా..అంతటా వెతికిన దొరకక పోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించిన హుజురాబాద్ టౌన్ సీఐ జి తిరుమల్ బాధితుని వద్ద నుండి ఫిర్యాదు తీసుకొని ఆయన చెప్పిన వివరాల ప్రకారం క్రైమ్ పార్టీ, సైబర్ పోలీసులను అలర్ట్ చేసి పట్టణంలో పలుచోట్ల వెతికించగా ఫోన్ పోయిన తర్వాత గంట రెండు గంటలలోనే కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఫోన్ బాధితుడు రాజుకు సీఐ తిరుమల్ అందించారు. కొద్ది గంటల్లోనే పోగొట్టుకున్న సెల్ ఫోను దొరికే విధంగా ప్రయత్నం చేసినందుకు సిఐ తిరుమల్ కి అనుప్ రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఏస్ఐ రాజేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్, పిసి ఉన్నారు.
