
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హనుమకొండ: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీర భద్ర స్వామివారి ఆలయంలో స్వామి వారి నక్షత్ర దీక్షను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో 27 రోజులపాటు నక్షత్ర మాల అలంకరణ జరుగుతుందన్నారు. నేను గతంలో ఈ దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా గెలిస్తే మాల దీక్ష తీసుకుంటానని మొక్కు కోవడం జరిగిందని పొన్నం తెలిపారు. ఈరోజు దీక్ష తీసుకొని 27 రోజులు దేవాలయ నియమ నిబంధనలకు అనుగుణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. చారిత్రాత్మక మహిమ కలిగిన భద్రకాళి సహిత వీరభద్ర స్వామి అని అన్నారు
నిన్ననే శ్రీశైలం వెళ్ళడం జరిగిందని, శ్రీశైలం రెండవ ద్వా దశ లింగాల్లో భాగంగా దేవుడి పక్కకు రాగానే భద్రకాళి సమేత వీరభద్రస్వామి విగ్రహం ఉంటుందని, బయటకు రాగానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి విగ్రహాలు ఉంటాయని, పూజలు జరుగుతాయని తెలిపారు. ప్రాచుర్యం కలిగి ఇంత మహిమ కలిగిన ఈ దేవాలయంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, అదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారని చెప్పారు.
దేవుడి మహిమ మీద విశ్వాసం ఉంది..
ఈ విశ్వాసం భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా అందరూ కూడా ఈ దీక్ష నా ఒక్కడి మంచి కొరకే కాకుండా సర్వేజనా సుఖినోభవంతు.. రైతులు వ్యవసాయం ,ఈ మధ్య అనేక అనారోగ్య సమస్యలు వస్తుండడంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సస్యశ్యామలం గా బాగుండాలని ఈ దీక్ష తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా ధైర్యాన్ని మనో భలాన్ని ఇవ్వాలని వీర భద్రస్వామి కోర మీసాల స్వామిని వేడుకుంటున్న అని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం కోట్లాడే దైర్యం ఇవ్వాలని అనేక సందర్భాల్లో మొక్కుకున్న అని గుర్తు చేశారు. ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి ఇక్కడి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా అన్ని కార్యక్రమాల్లో విజయవంతం అయ్యేలా ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని ఈ మాల అలంకరణ వేసుకున్నాను అని అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆయనతోపాటు చాలామంది భక్తులు మాలధారణ ధరించారు, అనంతరం మంత్రిత సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు దిగారు.


