
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ పరిధిలోని మామిండ్లవాడలో ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న
ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో హుజురాబాద్ కు చెందిన భీమారపు వెంకటేష్, జన్ను కొమరయ్య. శనిగరపు దిలీప్, భీమారపు సాయికృష్ణ, రాచపల్లి నరేందర్ లు ఉన్నారు. వారు ఇంటిలో మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్టు ఒప్పుకోగా వారి దగ్గర నుండి రూ.1630 రూపాయలు మరియు పేక ముక్కలను సీజ్ చేయడం జరిగిందని టౌన్ సీఐ జి తిరుమల తెలిపారు. హుజురాబాద్ టౌన్ మరియు మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ తిరుమల్ హెచ్చరించారు.






