
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ ఆగష్టు 07: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, హుజురాబాద్ మైటీ వరల్డ్ వ్యవస్థాపకులు బడుగు మధు సతీమణి బడుగు అనూష, ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారినీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. అనూష మృతి చెందిన తీరును కుటుంబ సభ్యులను అడిగి ఆమె చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజురాబాద్ బల్దియా చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు మోరే మధు, తాళ్లపల్లి వెంకటేష్ తదితరులు ఉన్నారు.






