
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలం శాలపల్లి గ్రామంలో పద్మశాలి భక్త మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చేనేత దినోత్సవం ఉద్దేశించి భక్త మార్కండేయ సేవా సంఘం అధ్యక్షుడు జడల చిరంజీవి మాట్లాడుతూ.. మాన ప్రాణాలు కాపాడేది బట్టేనని, పోగు పోగు తయారుచేసి ఒక బట్టగా నేసి ఆ బట్ట నేసే వాడికి జీవనోపాధి కోల్పోవడం వల్ల ఆపోగే ఉరితాడుగా మలుచుకుని జీవనాన్ని మా పద్మశాలి బిడ్డలు ముగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా పద్మశాలిలకు కూడా 10 లక్షల బీమా కూడా వర్తించే విధంగా గవర్నమెంట్ ఒక కార్యచరణ తీసుకురావాలని చెప్పారు. చనిపోయిన చేనేత కుటుంబాలకు ఇప్పుడున్న ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడల అశోక్ కుమార్, ఆడెపు పోషమల్లు, జడల ఐలయ్య, కొక్కుల శంకరయ్య, జడల పోశయ్య, ఎనుగందుల తిరుపతి, జడల సుధాకర్, వేముల భూపతి, ఆడెపు సమ్మయ్య, మెరుగు రాజు, దుస్స శ్రీనివాస్, కొక్కుల శ్రీనివాస్, ఎనగందుల సమ్మయ్య, మెరుగు నగేష్, గుత్తికొండ అంజయ్య, దుస సతీష్, వేముల రమేష్, కార్యవర్గ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







