
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 7వ తరగతి విద్యార్ధులు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలయంను బుధవారం సందర్శించారు. వస్త్రాలు వడకడం, నేయడం గురించి విద్యార్థులకు అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మానవాళికి వస్త్రాన్ని అందించిన ఘనత నేతన్నలదని చెప్పారు. మువ్వెన్నల జెండా నేసిన నేతన్నలను మన అందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కేవలం భౌతిక వృత్తే కాదని, కళాత్మకం, నైపుణ్యంతో కూడిన పని అన్నారు. ఈ పని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందన్నారు. చేనేత కుటుంబ సభ్యులే ఎక్కువగా ఈ కళను నేర్చుకుంటారన్నారు. చేనేత వస్త్రాలు ధరించి వారందరికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.






