మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిది, హుజురాబాద్: జాతీయ కరాటే పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన న్యూ కాకతీయ మోడల్ స్కూల్ విద్యార్థిని జి సహస్రను ఆ పాఠశాల ప్రిన్సిపాల్ బొద్దుల రాజ్ కుమార్, డైరెక్టర్లు తౌటం గోపాల్, మాసాడి వెంగళరావు అభినందించారు. గ్లోబల్ శో టా కాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొంది ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీలలో సహస్ర పాల్గొన్నారు. హుజురాబాద్ కు చెందిన కరాటే మాస్టర్ ఎస్ కె జాలీల్ వద్ద ప్రత్యేక శిక్షణ పొంది ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన గౌరూ నారాయణరెడ్డి మోమోరియల్ మొదటి జాతీయ స్థాయి కరాటే చాంపియన్ పోటీలలో 10.సం. విభాగంలో కటాస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచి
బంగారు పతకం సాధించిందన్నారు. దీంతో గురువారం బంగారు పతకం జీ సహస్ర మేడలో వేసి సత్కరించి రాజ్ కుమార్, గోపాల్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కరాటే పోటీలలో బంగారం పతకం సాధించడం ఈ ప్రాంతానికే కాకుండా కరీంనగర్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని అన్నారు.