Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ కొన్ని సంవత్సరాలుగా ఈయంఆరై గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ద్వారా నడపబడుతున్న 102 అమ్మఒడి వాహనంలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో గత ఎనిమిది నెలల క్రితం తన విధి నిర్వహణ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా హుజురాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. దీంతో ఉద్యోగికి రావలసిన జిటిఏ (గ్రూప్ ఇన్సూరెన్స్ భీమా) 5 లక్షల రూపాయల చెక్కును ఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర 108, 102 సర్వీసుల హెచ్ఆర్ ప్రధాన అధికారి బి కిరణ్ కిషోర్ గురువారం హుజురాబాద్ లోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఉద్యోగుల సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు అత్యవసర సేవల సిబ్బంది అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా 108 మేనేజర్ సలీం, కరీంనగర్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్, 108, 102,1962 పార్థివ వాహనాల సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







