మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ ఆగస్టు 8: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా వైద్యులు ఆస్పత్రి ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి చెట్ల ద్వారా అంది ప్రతిఫలాలను వివరించారు. రోజురోజుకు స్వచ్ఛమైన గాలి కొరవడుతున్న నేటి తరుణంలో మొక్కలు పెంచడం ద్వారా ఉచితంగా ఆక్సిజన్ లభిస్తుందన్నారు. మొక్కలు పెరిగి పెద్దవైయ్యాక చెట్ల కింద కూర్చుని సేద తీర్చుకోవడం, చెట్ల ద్వారా ప్రజలకు చాలా ఉపయోగాలు ఉన్నాయని వివరించారు. అందుకని ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లను పెంచడంను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసి హెచ్ఎస్ డాక్టర్ కృష్ణప్రసాద్, ఏరియా ఆసుపత్రి సూపరింన్ టీన్డెంట్ రాజేందర్ రెడ్డి, ఆర్ఎంఓ సుధాకర్ రావు, నజముల్లా ఖాన్, (అడ్మిట్ స్టేట్ యు ఆఫీసర్ ), ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.