Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన కోల్కతాలోని తన నివాసంలో కన్నమూశారు. ఈమేరకు సీపీఎం స్టేట్ సెక్రటరీ మహమ్మద్ సలీం వెల్లడించారు.
బుద్ధదేవ్ భట్టాచార్య 2000-2011 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. చూపు మందగించింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే ప్రజా జీవితానికి దూరమయ్యారు. ఆయన మొదటి పట్ల రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.






