
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీని శుక్రవారం MRPS అధినేత మంద కృష్ణ మాదిగ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆత్మీయంగా మంద కృష్ణ మాదిగని ఆలింగనం చేసుకొని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష, మూడు దశాబ్ధాల ఉద్యమ ఆశయం, సామజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనమైన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఉద్యమం విజయవంతం కావడానికి కేంద్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాల అండగా నిలిచిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి MRPS అధినేత మంద కృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా మాదిగ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరిందుకు మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మోడీ ఎంతో అనురాగంతో, ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరించి మంద కృష్ణ మాదిగ ఎడల, అలాగే MRPS ఉద్యమం పట్ల మరియు మాదిగ జాతి ఎడల తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు. ప్రధానమంత్రి తన ఛాంబర్ లో మంద కృష్ణ మాదిగని కూర్చోబెట్టుకొని కూలంకషంగా అనేక విషయాలు మాట్లాడం జరిగింది.








