
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: మాదిగ సంక్షేమ సంఘము ఎన్నకలు శనివారం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, అధ్యక్షులుగా బోరాగాల సారయ్య, ఉపాధక్షలుగా బొడ్డు మొగిలి, రొంటాల బాబు, మోరే మధు, కొంగ రవీందర్, బోరాగాల రవి, రాచపల్లి సారయ్య, మొలుగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర శ్రీనివాస్, ట్రెజరర్ గా ఎర్ర శ్రీధర్, కార్యదర్శలుగా శనిగరం చొక్కయ్య, చెట్టి అంజన్న, ఎర్ర గణేష్, అంంబాల శంకర్, రొంటాల శంకర్, బోరాగాల సాంబయ్య, బొడ్డు సంజీవ్, బోరాగాల సుదర్శన్, ముక్క రామస్వామి, ఎర్ర నాగరాజు, ఇల్లందుల కుమార్, రామగిరి శ్రీనివాస్, ఎర్ర మురళి, ఎర్ర రాజ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్ రావు ఆహ్వాన కమిటీ ఎన్నికల్లో బండ శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులుగా, బొడ్డు అయిలయ్య అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో దళిత నాయకులు, అంబేద్కర్ వాదులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొని కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.






