
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా శనివారం సాయంత్రం హుజురాబాద్ పట్టణంలోని బిజెపి, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి నిరసన ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ మందిరాలపై అక్కడి మైనారిటీలు, ముఖ్యంగా హిందూ మహిళలే లక్ష్యంగా జరుగుతున్న దోపిడీలు, ఆత్యచారాలు, హత్యలు, క్రూరమైన నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. వీటన్నింటినీ తీవ్రంగా ఖండిస్తు.. బంగ్లాలో అతి క్రూరంగా హింసకు గురవుతున్న హిందువులు, బౌద్ధులు ఇతర వర్గాలకు యావత్ ప్రపంచం అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందుత్వవాదులు గంగిశెట్టి రాజు, అంకతి శ్రీనివాస్, తూర్పాటి రాజు, నల్ల సుమన్, గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, యాంసాని శశిధర్, యాళ్ల సంజీవరెడ్డి, బోరగల సారయ్య, కొలిపక శ్రీనివాస్, అల్లి శ్రీనివాస్, కోలిపాక వెంకటేష్, బెజ్జంకి రవీందర్, క్యాస వెంకటేష్, కుసుమ సమ్మయ్య, అంకతి సాయిగణేష్, కోయాడ రాజేష్, క్యాస సాయి, హిందుత్వవాదులు తదితరులు పాల్గొన్నారు.







