
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్ ఆగస్టు 10:
ఇండో అమెరికన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు అమెజాన్ ఫుచర్ ఇంజనీర్ వారి నీతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన జమ్మికుంట ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థిని సనా ఖాన్ ను యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షుడు సజ్జాద్ మొహమ్మద్, జోరుక సాయిలు కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాల నుండి 80 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారి నైపుణ్యాంలో జిల్లాస్థాయి కాంపిటేషన్ నిర్వహించగా డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ స్కిల్స్, కోడింగ్, మ్యాస్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర డిపార్ట్మెంట్లకు సంబంధించి విభాగాలలో జమ్మికుంట పాఠశాల విద్యార్థిని సనఖాన్ ఇందులో మొదటి బహుమతి పొందినందుకుగాను యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ కార్యనిర్వాహక అధ్యక్షులు సజ్జాద్ మొహమ్మద్, జోరుక సాయిలు ఆమెను శాలువాతో సన్మానించారు.






