Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం రాచపల్లి గ్రామంలోని గాంధీ మహాత్ముని విగ్రహన్ని శుద్ధిచేసి అనంతరం పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఇల్లందకుంట మండల బిజెపి అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహనీయులు ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. అనేకమంది మహనీయుల పోరాటం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని, ఈరోజు మనమందరం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే దానికి ఆ మహనీయుల కృషి ఫలితమే కారణమని అన్నారు. ప్రతి ఒక్కరూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తిరుపతిరెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మట్ట పవన్ రెడ్డి, గుత్తికొండ రాంబాబు, మద్దూరి మల్లేశం, బెల్లం హరీష్, రాజుకుమార్, రాజ, అంకుశావళి, కట్టంగూరి నరేందర్ రెడ్డి, మహేందర్, అరవింద్, సదానందం, శ్రీకాంత్, చంద్రయ్య, దీలిప్, దేవరాజు, రాకేష్, రమేశ్, శ్రీనివాస్, రాజు, శ్రీధర్, రమేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.






