
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ జామా మసీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఆదివారం స్థానిక జామా మసీదులో నిర్వహిస్తుండగా అభ్యర్థులు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. హుజురాబాద్ డివిజన్లోనే పెద్దదైన జామా మసీద్ కు సుమారు 1000 మంది సభ్యులు కలిగి ఉన్నారు. ఇతర సహకార సంఘాలకు ఎన్నికలు జరిగినట్లుగానే జామ మసీదుకు కూడా ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అధ్యక్ష స్థానానికి ముగ్గురు అభ్యర్థులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మహమ్మద్ అబ్దుల్ గఫర్, మహమ్మద్ నవాబ్ పోటీ పడుతున్నారు. అలాగే కార్యదర్శి పదవికి ముగ్గురు పోటీలో ఉన్నారు. కోశాధికారి పదవికి ముజాహిద్ ముందుగానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 8 మంది కమిటీ సభ్యుల ఎన్నిక కోసం 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్న 2:00 వరకు జరగనున్నాయి. ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరూ హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఎలాగైనా గెలవాలని కృషి చేస్తుండడంతో ఎన్నికల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు మధ్య నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా పనికి సాయంత్రం కల్లా ఓట్లను కౌంటింగ్ చేసి రిజల్ట్ తెలూపనున్డడంతో పట్టణంలో ప్రధానంగా ఈద్గా కమిటీకి నూతన కమిటీ, సభ్యులలో ఎవరు గెలుస్తారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.









