మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ జామా మసీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఆదివారం జామా మసీదులో నిర్వహిస్తుంచగా అధ్యక్ష స్థానానికి ముగ్గురు అభ్యర్థులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, మహమ్మద్ అబ్దుల్ గఫర్, మహమ్మద్ నవాబ్ పోటీ పడగా ముజాహిద్ హుస్సేన్ గెలుపొందారు. అలాగే కార్యదర్శి పదవికి ముగ్గురు పోటీలో నిలువుగా మున్ను గెలుపొందారు. అధ్యక్షుడుగా గెలిచిన అనంతరం ముజాహిద్ హుస్సేన్ పట్టణంలో పలువురు ముస్లింలు సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి ప్రతిసారి నాకు సహాయ సహకారాలు అందిస్తూ సలహాలు ఇస్తూ ముస్లిం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేయాలని చెప్పుతూ వచ్చారన్నారు. హుజరాబాద్ పట్టణంలో పెండింగ్లో ఉన్న ముస్లిం ప్రజల షాదిఖానా, నూతనముగా మంజూరైన కబ్రిస్తాన్ స్థలము చుట్టూ ప్రహరీ గోడ, పట్టణంలో నిర్వహించిన నూతన ఉస్మాన్ సేట్ షాపింగ్ కాంప్లెక్స్ కు బంధించిన టాక్స్ సమస్య పరిష్కారం చేయించాలని ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగిందన్నారు. కనుక ఈసారి నూతన కార్యవర్గంలో ఉన్న నాయకులందరూ చాలా అనుభవము చాలా మంచి సలహాలు ఇచ్చినట్లయితే అన్ని రకాల పనులు చేయించడానికి మా నూతన కార్యవర్గం పనిచేస్తుందని హుజురాబాద్ జామే మజీద్ ఈద్గా కబ్రాస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలిపారు. మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నూతనంగా ఎన్నికైనందుకు ఉద్యోగ సంఘాలు, ముస్లిం కమిటీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కు శాల్వలతో పుష్పగుచ్చాలతో సన్మానించి, సీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించిన ముస్లిం సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముస్లింల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు.