Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా నియమించినందుకు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా
నియమించి నందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు, తెలంగాణ మంత్రివర్గానికి ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకుండా, గౌరవించకుండా అణచివేత ధోరణి అవలంబించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తూ, గౌరవిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నందుకు తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన, ఉచిత విద్యను అందించేందుకు, విద్యావ్యవస్థ పటిష్ట పరిచేందుకు కోదండరాంని మంత్రివర్గంలోకి తీసుకుని విద్యాశాఖను కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






