
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ మహిళలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పిలుపుమేరకు హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలను కించపరుస్తూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మహిళలు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూసి ఓర్వలేని కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్య ఇచ్చి ముందుకు నడిపించేలా కార్యక్రమాలు చేపడితే చూసి భరించలేకపోతున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం కేటీఆర్ కి ఇష్టం లేదని అందుకే బస్సులలో తిరుగుతూ అల్లికలు చేస్తూ డాన్సులు చేయండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. వెంటనే కేటీఆర్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరోసారి మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలు యేముల పుష్పలత, హుజూరాబాద్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆలేటి సుశీల, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, కొలిపాక శంకర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, యండి అఫ్సర్, గంట కిరణ్ రెడ్డి, సొల్లు థశరథం, సందమల్ల బాబు, విజేందర్, కడారి తిరుమల, పుల్ల రాధ, శీలగాని లక్ష్మీ, రఘుపతి, రొంటాల సందీప్, కుర్ర శ్రీనివాస్ గౌడ్, కెఆర్ బిక్షపతి, యండి షాదిక్, సుజాత సోల్లు, సునిత, రేణుకా, కోమల, రిబ్కా, మనోహరదేవి, ఇమ్మడి నిరంజనీ, అరుణ, కరీమా, స్వరూప, గడ్డం రాఘవేంద్ర, రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.
