
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఈశ్వరియ బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో శుక్రవారం హుజురాబాద్ లోని పలు కార్యాలయాలలో, ప్రముఖుల ఇండ్లలో ముందస్తు రాఖీ పండుగ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు గందే శ్రీనివాస్ కు, కార్యాలయాలలో ఉద్యోగులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, బ్రహ్మకుమారీలు కల్పన, శ్రీవాణి, కోటోజు జ్యోతిరాణి, రాజయ్య, శివరాత్రి ఈశ్వరయ్య, నిరంజన్, హుజురాబాద్ పోస్ట్ మాస్టర్ యు మహేందర్, రాజు, వేణు, శ్రీనివాస్, సందీప్, గౌరవ్, అనిల్, తిరుపతి నాయక్, హరీష్, సతీష్, స్వామి, రాజేష్, అపూర్వ, రాము, సత్యం తదితరులు పాల్గొన్నారు.
