స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: 2020లో క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేక మేడలు కాదు. ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతల పర్వం మొదలైంది. హైడ్రా ఆపరేషన్ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మరోవైపు లే -అవుట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్.. LRS పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లే అవుట్స్, ప్లాట్స్ క్రమబద్దీకరణకు మరో ఛాన్స్ ఇచ్చింది. కాకపోతే కండీషన్స్ అప్లయ్. 2020 అక్టోబర్ 15లోపు దరఖాస్తు చేసుకున్న వాళ్లకే క్రమబద్దీకరణ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు సంబంధిత అధికారులు. 131, 135 జీవో నెంబర్ల ప్రకారం రాష్ట్రాల అక్రమ లే-అవుట్స్, ప్లాట్స్ రెగ్యూలరైజషన్ కోసం 2020లో నియమ నిబంధనలు జారీ అయ్యాయి.
2020 ఆగస్టు26 కన్నా ముందు రిజిష్టర్ చేసిన లే అవుట్లకు మాత్రమే LRS వర్తిస్తుందని స్పష్టం చేశారు. గైడ్‌లైన్స్ 2020లోనే విడుదలైనా దరఖాస్తుల పరిశీలన గత జనవరి నుంచే మొదలైంది. ఇప్పటి వరకు 4లక్షల 28వేల 832 అప్లికేషన్లను స్క్రూట్నీ చేశారు. 60 వేల 2వందలకు పైచిలుకు దరఖాస్తులకు ఆమోద ముద్ర పడింది. తద్వారా ఫీజుల రూపేణ సర్కార్ ఖజానాలో 96 కోట్ల 60 లక్షలు జమయ్యాయి. మరి మిగతా అప్లికేషన్ల మాటేంటి? దాదాపు 75 శాతం దరఖాస్తులకు ఆమోద ముద్రం పడకపోవడానికి కారణం..సరైన డాక్యుమెంట్లు సమర్పించకపోవడం..సమగ్ర వివరాలు పొందుపర్చకపోవడం.అలాంటి వారికి ఇప్పుడు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సేల్ డీడ్, ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ , లే-అవుట్ కాపీలను జతపరిస్తే మళ్లీ ఆ దరఖాస్తులను పరిశీలిస్తారు. మొబైల్ ద్వారా కూడా డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. లేదంటే మున్పిపాల్టీలు, కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్‌మెంట్ అథార్టీ ఆఫీసుల్లో స్వయంగా ఇవ్వొచ్చు. సలహాలు సూచనల కోసం హెల్ప్ డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు.