Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కళాశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు ఆదివారం సిల్వర్ జూబ్లీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ళ ముందు కష్టపడి చదివితేనే ఈనాడు ఇలా గొప్పగా స్థిర పడ్డామని పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. కళాశాల సమయంలో తోటి విద్యార్థులతో ఆడి పాడిన రోజులను గుర్తు చేసుకొని నేడు స్థిరపడ్డ ఆర్థిక స్థితిగతులను ఒకరినొకరు అడిగి తెలుసుకుని గత స్మృతులను, నేటి జీవనాన్ని గుర్తుచేసుకొని సంతోషంగా గడిపారు. అప్పటి అధ్యాపకులను పూల బోకెలతో శాలువాలతో ఘనంగా సత్కరించి గురు భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి అధ్యాపకులు సమ్మయ్య, ప్రభాకర్ రావు, మొండయ్య, శ్యామ్ సుందర్ రెడ్డి, రమణారెడ్డి, వెంకటచారి, మండల సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి, లత, స్థానిక కళాశాల అధ్యాపకులు మారబోయిన వేణుమాధవ్, చెల్మల్ల రాజేశ్వర్ రెడ్డి, జగన్, విద్యార్ధినీ విద్యార్థులు కాసర్ల అనిల్, కొలిపాక సంజయ్, బోరగాల ప్రవీణ్, శ్రీకాంత్, సత్యం, ఉమాకర్, ఏనూరి రాజు, దోమల శ్రీ శైలం, రమ్య, స్వప్న, భార్గవి, దేవేంద్ర, మంగ, స్వాతి, కవిత తదితరులు పాల్గొన్నారు.







