
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలు హుజురాబాద్ లోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో గల సర్వాయి పాపన్న విగ్రహం వద్ద సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్థానికులకు కేకులు, సీట్లు పంచిపెట్టారు. రజాకార్లను ఎదిరించి పోరాడిన సర్వాయి పాపన్న ఘన చరిత్రను ఈ సందర్భంగా పలువురు కీర్తించారు. సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం హుజురాబాద్ మండల అధ్యక్షుడు కందాల రాజ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరమండ్ల సదానందంగౌడ్, జిల్లా మీడియా అధికార ప్రతినిధి మ్యాడ గోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాటూరీ శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపెళ్లి రాజమౌళిగౌడ్, జిల్లా కార్యదర్శి బుర్ర సమ్మయ్యగౌడ్, పోతిరెడ్డిపేట గ్రామ అధ్యక్షుడు చింతల(సిరి సేడు) సారయ్యగౌడ్, బోర్నపల్లి అధ్యక్షుడు కుర్ర సంపత్ గౌడ్, కందుగుల అధ్యక్షుడు మండ శ్రీనివాస్ గౌడ్, ధర్మరాజుపల్లె వీరగోని తిరుపతిగౌడ్, కనుకులగిద్ద పంజాల తిరుపతిగౌడ్, హుజురాబాద్ శ్రీపతి కుమార్ గౌడ్, చేల్పూర్ మహేందర్ గౌడ్, రాంపూర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పెద్దపాపయ్యపల్లి బుర్ర తిరుపతిగౌడ్, రంగాపూర్ మండ వినయ్ గౌడ్, సింగపూర్ బొంగోని రమేష్ గౌడ్, తుమ్మనపల్లి గొడిశాల రాజయ్యగౌడ్, మహేష్ గౌడ్, ఇప్పల నర్సింగాపూర్ పల్లె వీరయ్యగౌడ్, దమ్మక్కపేట ప్రెసిడెంట్ అనపురం తిరుపతిగౌడు తదితరులు సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలల్లో పాల్గొన్నారు.








