స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : ఎల్బి స్టేడియంలో ఆగస్టు 29 రోజున జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ ను , టీ షర్ట్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ఆవిష్కరించారు. ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు. ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తరువాత తెలంగాణలో కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. స్పోర్ట్స్ కార్యక్రమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల నుండి తెలంగాణలో ప్రజా పాలనలో క్రీడాకారులను వారి నైపుణ్యాలను బయటకు తెచ్చే విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుందన్నారు. అందులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగిందన్నారు. రాష్ట్రం భవిష్యత్ లో క్రీడా రంగంలో నంబర్ 1 ఉండాలన్నారు. క్రీడా రంగంలో భవిష్యత్ లో పాఠశాల దశ నుండి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని ప్రయత్నం లో భాగంగా క్రీడా దినోత్సవం ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మంత్రులు, ఎమ్మేల్యేలు, ప్రభుత్వ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలాన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్ ,ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి
ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.