
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామ శివారులో గల కాలీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా హుజురాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ జీ తిరుమల్ గౌడ్ సిబ్బందితో వెళ్లి చూడగా అక్కడ నలుగురు వ్యక్తులు పేకాడుతూ పట్టుబడినట్లు సిఐ తెలిపారు. పేకాడుతూ పట్టుబడిన వారిలో రాజు, మధు, అశోక్, ప్రసాద్ అనే నలుగురు మూడు ముక్కల పేకాట ఆడుతుండగా వారిని పట్టుకొని పంచుల సమక్షంలో పంచనామా చేసి వారి దగ్గర నుండి రూ .5,400 రూపాయలు మరియు పేక ముక్కలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి వారి పైన కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. హుజురాబాద్ టౌన్ మరియు మండల పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారి పైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సిఐ తిరుమల గౌడ్ హెచ్చరించారు.






