
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, కరీంనగర్: బీసీ మహిళ ఇన్చార్జ్ మేయర్ పదవికి కూడా పనికిరాదా అని, అగ్రవర్ణాలనే అహంకారంతో బీసీలను… మేయర్ సునీల్ రావు అవమానపరుస్తున్నాడని కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరి శంకర్ ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మేయర్ వ్యవహార శైలిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. మేయర్ సునీల్ రావు ఆగస్టు 23 నాడు అమెరికా పర్యటనకు వెళ్ళే విషయం… డిప్యూటీ మేయర్ అయినా నాకు… మాట వరుసకు కూడా చెప్పలేదు అన్నారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు మేయర్ పిఏ మున్సిపల్ గ్రూపులో పెట్టిన మెసేజ్ ద్వారా యూఎస్ కు వెళ్లినట్టు తెలిసిందన్నారు. రెండు వారాల పాటు పోతున్నాడు అనే విషయం మెసేజ్ ద్వారా తెలిసిందని, మాకు తెల్సిసిన వారు మేయర్ రెండు వారాలు కాదు… 33 రోజులు వెళ్తున్నడని ఆయన ఫ్లైట్ టికెట్ మాకు వాట్సాప్ చేశారన్నారు.
మున్సిపల్ యాక్ట్ ప్రకారం 15 రోజులు కానీ అంతకన్నా ఎక్కువ రోజులు మేయర్ అందుబాటులో లేకుంటే… డిప్యూటీ మేయర్ కు చార్జి ఇవ్వాలని చట్టం చెబుతుందన్నారు. వారి ఫ్లైట్ టికెట్ ప్రకారం 33 రోజుల పాటు అమెరిక పర్యటన ఉందన్నారు. 33 రోజులు వెళ్తున్నాడని, డిప్యూటీ మేయర్ గా మాకు బాధ్యత ఉన్నందున మాకు మేయర్ గా ఇన్చార్టి ఇవ్వాలని కలెక్టర్ ను కోరాం అని అన్నారు. వారు టికెట్ లో ఉన్న ప్రకారం 33 రోజులు వెళ్తున్నడని తెలుసుకొని మున్సిపల్ యాక్ట్ ప్రకారం డిప్యూటీ మేయర్ కు బాధ్యత ఇవ్వాలని కమిషనర్, కలెక్టర్ కు రెకమండ్ చేశారన్నారు. స్పందించిన కలెక్టర్ అమెరికా వెళ్ళిన మేయర్ కు నోటీసు పంపించారన్నారు. ఆ నోటీసుకు జవాబుగా మేయర్ సునీల్ రావు నెల రోజుల కొరకు వచ్చింది వాస్తవమే.. కాని నేను సెప్టెంబర్ 6 వరకు ఇండియాకు వస్తున్నానని… కలెక్టర్ కు మెసేజ్ చేశారని తెలిసిందన్నారు. కలెక్టర్ నోటీసు ఇచ్చిన వెంటనే డిప్యూటీ మేయర్ మా పార్టీ యేనని… ఆవిడకు ఇంచార్జీ ఇవ్వండి అని చెప్పాల్సింది పోయి… హుటాహుటిన టికెట్ రద్దు చేసుకొని రావడం చూస్తే నగరపాలక సంస్థలో నలుగున్నరేళ్లలో ఎన్ని తప్పులు జరిగాయోనని అనుమనించాల్సి వస్తోందన్నారు. జూన్ 25 తేదీ రోజే 33 రోజులు కొరకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ తీసుకున్న మేయర్… రెండు నెలల తర్వాత అమెరికా వెళ్లారని చెప్పారు. 14 రోజులు మాత్రమే అమెరికాకు వెళ్లే ఉద్దేశముంటే గత 2 నెలలుగా టికెట్ ను ఎందుకు 14 రోజులకు మార్చుకో లేదని ప్రశ్నించారు.
మేము ఇన్చార్జి బాధ్యతలు కలెక్టర్ ని అడగగానే హుటాహుటిన 33 రోజుల టికెట్ క్యాన్సిల్ చేసుకొని 14 రోజులకే తిరిగి వస్తున్నాడు అంటే కేవలం బీసీ మహిళ అయిన నాకు ఇన్చార్జి ఇవ్వడం ఇష్టం లేకనే అని అర్ధం అవుతుందనీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని కరీంనగర్ ప్రజలు పార్టీ శ్రేణులు గమనించాలన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ లం ఇద్దరం ఒకే పార్టీకి చెందిన వారమే… అయినా 15 రోజుల కంటే తక్కువ రోజులు విదేశాలకు వెళ్ళినా ఒక్కటే పార్టీకి చెందిన మాకు బాధ్యత ఇవ్వరాదా…? ఇది నాకు జరిగిన అవమానం కాదా..! అని వారు పేర్కొన్నారు. ఒక బీసీ మహిళగా నాకు ఇన్చార్టి మేయర్ గా అవకాశం ఇవ్వద్దనే దురుద్దేశంతో వెళ్ళేటప్పుడు చెప్పక పోవడం, చార్జి ఇవ్వాలని కలెక్టర్ కు విన్న వించగానే నెల రోజుల పర్యటనను 15 రోజుల్లో ముగించుకొని తిరిగి వస్తున్నాడంటే ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి, అర్ధం చేసుకోవాలి అని ఆమె సూచించారు. నాలుగున్నర సంవత్సరాలుగా డిప్యూటీ మేయర్ గా మాకు ఎటువంటి గౌరవం ఇవ్వకున్నా, పార్టీ విధేయులుగా మౌనంగా ఉన్నాం అన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా అంతర్గతంగా ఎన్ని అవమానాలు జరిగినా ఓపికగా ఉండి అధిష్టానం ఆదేశాల మేరకు మౌనంగా ఉండడం జరిగిందన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాకు ఇంతటి అవమానం చేసిన మేయర్ పై పార్టీ అధిష్టానం చర్య తీసుకోవాలన్నారు.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మేయర్ కు బీసీల పట్ల మహిళల పట్ల ఉన్న గౌరవం ఎంత ఉంది అనేది అర్ధం అయిపోతుందన్నారు. తెలంగాణ కోసం పోరాడాడనో… ఇంకా ఏదో చేశాడనో బిఆర్ఎస్ అధిష్టానం ఆయనను మేయర్ పదవి కట్టబెట్టలేదన్నారు. సునీల్ రావుకు మేయర్ పదవి మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్న పెట్టిన భిక్ష అన్నారు. తనకు మేయర్ పదవి ఇచ్చిన వినోద్ కుమార్ కి సున్నం పెట్టిన ఘనత సునీల్ రావుది అని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలవేళ వినోద్ కుమార్ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్నారనీ ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసమే బండి సంజయ్ పేరు వాడుకుంటున్నాడన్నారు.
చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. 33 రోజుల అమెరికా పర్యటన కోసం టికెట్ కొనుక్కున్న మేయర్ సునీల్ రావు 14 రోజులకే వెనక్కి వస్తుండడంలో ఆంతర్యం ఏమిటి అన్నారు. నగరపార్టి అధ్యక్షునిగా ఉన్న నాకు అమెరికా వెళుతున్నట్టు మాట వరసకు కూడా చెప్పలేదు అన్నారు. జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారనీ, ఓవైపు వర్షాకాలం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనీ, వినాయక చవితికి ఎలాంటి ఏర్పాట్లు కూడా చేపట్టలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్ కు ఇన్చార్జి ఇవ్వకుండా యూఎస్ ఎలా వెళ్లావు అనే సునీల్ రాను నిలదీశారు. మేము ఫుల్ ఛార్జ్ అడగలేదు… కేవలం ఇంచార్జ్ మాత్రమే అడిగాము అన్నారు. ఇంచార్జి మేయర్ పదవిని బిసి మహిళకు ఇచ్చే అర్హత కూడా లేదా డిప్యూటీ మేయర్ పదవి మాకు సునీల్ రావు పెట్టిన భిక్ష కాదు అన్నారు.
33 మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు… ఏడుగురు స్వతంత్ర కార్పొరేటర్లు… మరో ఏడుగురు ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ గా సునీల్ రావును, డిప్యూటీ మేయర్ గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో డిప్యూటీ మేయరుగా నన్ను ఏ అధికారిక కార్యక్రమానికి పిలిచిన పాపాన పోలేదన్నారు. మేయర్ వ్యవహార శైలి చూస్తుంటే మున్సిపాలిటీలో పెద్దఎత్తిన అవినీతి జరిగినట్టు అర్థమవుతుందనీ, రేపటినుండి మున్సిపాలిటీలో ప్రతి సెక్షన్ వైజ్ గా సమాచారం తీసుకొని తప్పులు జరిగితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెలికి తీయడమే ధ్యేయంగా పనిచేస్తాం అన్నారు. నిధులు దుర్వినియోగం జరిగినట్టు మా దృష్టికి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాం అని ,మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంకా వినాయక చవితి ఏర్పాట్లు పూర్తికాలేదనీ చెప్పారు. నగర ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారనీ, అసలే వర్షాకాలం ఎప్పుడు ఏ వర్షం పడి ఏమి ఇబ్బంది జరుగుతుందో మేయర్ గా నువ్వు లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడాలా అనే ప్రశ్నించారు. బీసీ మహిళకు ఇన్చార్జి పదవి ఇచ్చే అర్హత కూడా లేదా అని, నువ్వు రావడానికి ఇంకొక 11 రోజుల టైం ఉందనీ చెప్పారు. మా పార్టీ అభ్యర్థి అయిన డిప్యూటీ మేరకు ఇన్చార్జి ఇవ్వాలని కలెక్టర్ కు చెప్పాల్సి ఉండే అని, ఇంచార్జి మేయర్ పదవికి మేము అర్హులం కాదా. అగ్రవర్ణాలు అనే అహంకారంతో బీసీ మహిళను అవమానపరిచారనీ ఆరోపించారు. మేయర్ సునీల్ రావు వ్యవహార శైలితో గత నాలుగున్నర సంవత్సరాలుగా కుమిలిపోతున్నాం అన్నారు. మున్సిపాలిటీ కార్పొరేటర్ లను గ్రూపులుగా విభజించిన ఘనత సునీల్ రావుది అన్నారు. మిగిలిన 11 రోజుల్లో… మీరు మాకు ఇన్చార్జి ఇవ్వకున్నా… డిప్యూటీ మేయర్ గా సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటాం అని తెలిపారు. మేయర్ సునీల్ రావు అమెరికా పర్యటనపై మా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతే కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్ళాం అని, ఇప్పుడు కూడా మా అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లేందుకే మీడియా ముందుకు వచ్చాము అని తెలిపారు. ఇది ముమ్మాటిగా బీసీ మహిళకు జరిగిన అవమానమే అని, బిసి ఆడబిడ్డకు జరిగిన అవమానంపై బీసీలు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కరీంనగర్ ప్రజలు ఆలోచించాలనీ స్వరూప రాణి హరిశంకర్ పేర్కొన్నారు.








