–వైయస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయం
–వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు
–వృద్ధులకు నిరాశ్రయులకు పండ్ల పంపిణీ చేసిన యువజన కాంగ్రెస్ నేతలు
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా బోర్నపల్లిలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వృద్ధులకు మరియు నిరాశ్రయులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలను గొప్పగా అభివృద్ధి చేసిన వ్యక్తి స్ఫూర్తి ప్రధాత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో ఏ నాయకుడు ప్రవేశపెట్టలేదని అన్నారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ తో పేద మధ్య తరగతి విద్యార్థులు ఇప్పటికీ ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు అంటే అది రాజశేఖర్ రెడ్డి చలవనే అని ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకంతో పేదలకు కార్పొరేట్ వైద్యం సైతం చేరువ చేశారని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క పథకం దేశానికి దిక్సూచిలా మారాయని అన్నారు. ప్రజలకు వచ్చిన కష్టాన్ని తనకు వచ్చిన కష్టంగా భావిస్తూ నిత్యం ప్రజాసేవలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ తన చివరి శ్వాస వరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బ్రతికిన మహానుభావుడు వైయస్సార్ అని కొనియాడారు. ఈ కార్య క్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సందమల్ల నరేష్, టేకుల శ్రావణ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సందమల్ల బాబు, దుబాసి బాబు, బత్తిని రవీందర్ గౌడ్(బి ఆర్ గౌడ్), ముక్క రమేష్, జంగ అనిల్ కుమార్, చల్లూరి విష్ణువర్ధన్, కొండ్ర నాగరాజు, కుక్కముడి రాజేష్, కొండ్ర వినయ్ తదితరులు పాల్గొన్నారు.