
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపంలో పట్టణ ప్రజల అవసరాల కోసం మిషన్ భగీరథ కింద రెండు అతిపెద్ద వాటర్ ట్యాంకులను నిర్మించింది విధితమే. అయితే ఆ వాటర్ ట్యాంక్ లో నీరు నిండి వృధా అయిపోతున్నాయని కాలని వాసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు రాత్రి 7గంటల నుండి తెల్లరి 10 గంటలకు వాటర్ ఆన్ చేసి దానిని ఆఫ్ చెయ్యడం సంబంధిత సిబ్బంది మర్చి పోతుండడంతో ఎంత విలువైన తాగునీరు వృధాగా పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న ఇండ్లల్లో వాటర్ ట్యాంక్ పై నుంచి కిందికి పడుతున్న వాటర్ శబ్దానికి నిద్ర కూడా పోవడం లేదన్నారు. ట్యాంక్ నీరు నిండగానే నీళ్లు ఆఫ్ చెయ్యాలని కాలని వాసులు కోరుతున్నారు. కొన్ని చోట్లా ఒక్కో బిందెడు నీళ్ల కోసం మహిళలు మైళ్ళ కొద్ది దూరం వెళ్లి తెచ్చుకుంటున్న సంగతిని మరచిపోయి హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది నీటి సరఫరా విషయాన్ని నిర్లక్ష్యం చేయడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీరు వృధా పోకుండా అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

