
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి పట్ల హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు స్థానిక హై స్కూల్ క్రీడామైదానంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. అకాల మరణం చాలా బాధాకరం అని, ఆయన దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని పలువురు కొనియాడారు. ప్రజా ఉద్యమాల్లో నిరంతరం పోరాటం చేసేవారని, దేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయింది అని వాకర్ సభ్యులు పేర్కొంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ నాయకులు సాదుల రవీందర్, వేల్పుల రత్నం, పాక సతీష్, మార్తా రవీందర్, వేల్పుల ప్రభాకర్, పంజాల రామ్ శంకర్ గౌడ్, బండ కిషన్, బత్తుల రాజలింగము తదితరులు పాల్గొన్నారు.
