
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని కాకతీయ కళాశాల విద్యార్థిని జంపాలా శివ సంతోషిని జాతీయ హాకీ టోర్నమెంట్ (జార్ఖండ్)లో పాల్గొని ట్రోఫీ సాధించిన సందర్భంగా, కళాశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్, డైరెక్టర్స్ సిహెచ్ రాజేశ్వర్ రెడ్డి, కే తిరుపతిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, జె ప్రకాష్ రెడ్డి, మరియు అధ్యాపకులు ఆమెకు శాలువా కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో శివ సంతోషిని మరిన్ని విజయాలు సాధించి తల్లితండ్రులకు, హుజురాబాద్ కి మంచి పేరు తేవాలని, మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తమ కళాశాలలో ఉన్నట్లు వారు తెలిపారు.


జాతీయస్థాయిలో రాణించిన శివ సంతోషినీకి శాలువా కప్పి అభినందిస్తున్న కాకతీయ కళాశాల యాజమాన్యం..

జాతీయస్థాయిలో రాణించి సర్టిఫికెట్ సాధించిన శివ సంతోషినీ