
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్:
తెలంగాణ విద్యారంగ సామ్రాట్ మరియు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి డా.వి.నరేందర్ రెడ్డి కామారెడ్డిలో నిర్వహించిన రెడ్ల ఆత్మీయ సమ్మేళనంకు ఆత్మీయ అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడే విద్యా సంస్థలకు అకాడమిక్ & నాన్ అకాడమిక్ వ్యవహారాలలో సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. అదే విధంగా విద్యాసంస్థలను నెలకొల్పడానికి తనవంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించి చెక్కును రెడ్డి సంఘం ప్రతినిధులకు అందజేశారు. విద్యాసంస్థల బలోపేతానికి చేయూత నిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక శాసనసభ్యులు కె.వెంకటరమణారెడ్డి వారికి శుభాభివందనలు తెలిపారు. అలాగే రెడ్డి సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలుపుతూ సన్మానం చేశారు.







