Oplus_0
–నిమజ్జన వేడుకల్లో చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి
–గణేశ నిమర్జనం ఊరేగింపులో రథల విగ్రహాలకు విద్యుత్ వైర్లు తగలకుండా జాగ్రత్తగా ఉండాలి.
– చెరువుల వద్ద ప్రత్యేక శ్రద్ధ వహించండి.
– నిమజ్జన వేడుకల్లో చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం లో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాధుని నిమజ్జన వేడుకలో జాగ్రత్తగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ నిమజ్జనం అంటే పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి పాల్గొంటారు. కావున పిల్లల విషయంలో తల్లిదండ్రులతో పాటు గణేష్ మండపాల నిర్వహకులు జాగ్రత్తగా ఉండాలని, నిమజ్జనం చేసే సమయంలో గ్రామాల్లో విద్యుత్ వైర్లు తగలకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్వహుకులను కోరారు.






