
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: దళితులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షత చూపుతుందని, హుజురాబాద్ లోని దళితబందు బాధితుల ఉసురు తాకి పోతారంటూ దళిత బాధితులు శాపనార్థాలు పెట్టారు. ఈరోజు హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద దళితబందు సాధన సమితి ఆధ్వర్యంలో రెండవ విడత దళితబందు నిధులు విడుదల చేయాలనీ ఉరి ప్రదర్శన కార్యక్రమన్ని చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రోగ్రాం చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో ..దళితబందు సాధన సమితికి భయపడే మంత్రి పొన్నం ప్రభాకర్ అరెస్టు చేయించారని వారు ఆరోపించారు.
హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితబందు రెండవ విడత నిధులకోసం గత 10నెలల నుండి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే అనేక కార్యక్రమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెవిటోడి ముందు శంఖం ఉదినట్టు ఉందన్నారు. ఈ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖమ్మంలోని చింతకాని మండలంలో 847 కుటుంబాలకు 15కోట్ల 54లక్షల 32వేయిల 620 విలువైన దళితబందు చెక్కుల ప్రొసీడింగ్ కాపీలు అందించడం జరిగిందని గుర్తు చేశారు. మరి హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులు ఏం పాపం చేసారని అన్నారు. మాకు రావాల్సిన రెండవ విడత నిధులు ఆపుతున్నారని, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఒక్కరూపాయి కూడా కేటాయించాల్సిన అవసరం లేదని, గత ప్రభుత్వం మా ఖాతాలో జమ చేసిన రూ. 10లక్షల నుండి 5లక్షలు ఇచ్చారని మిగితా 5లక్షలు ఇవ్వడానికి మీకేం నొప్పి అని బాధితులు ప్రభుత్వన్ని అడిగారు. కేవలం నీ నియోజకవర్గం దళితులకే నువ్వు ఉప ముఖ్యమంత్రివ మాకు కదా చింతకాని మండలం దళితులపై కన్నతల్లి ప్రేమ మిగితా రాష్ట్రంలో ఉన్న దళితులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తే దళితుల ఉగ్రరూపం ఎలా ఉంట్టుందో ఈ ప్రభుత్వని చూపించడానికి దళితులు అంత ఏకమై ఉన్నారని దళిత బాధితులు ఆరోపించారు.
ఇప్పటికైనా హుజురాబాద్ నియోజకవర్గంలోని రెండవ విడత దళితబందు నిధులను వెంటనే విడుదల చేయాలనీ లేని పక్షంలో రాష్టంలో ఉన్న దళితులం అంత ఏకమై ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడి చేసి రెండవ విడత మంజూరు చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, మంద రాజేష్, కోలుగూరి నరేష్, అకినపల్లి ఆకాష్, ఇనుగాల బిక్షపతి, దసరాపు నాగరాజు, మహంకాళి రమేష్, గాజుల కుమార్, సరిగోమ్ముల విజయ్, రామంచ శ్రీకాంత్, మోతె అర్జున్, సరిత, అరుణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


—————+++++—————-
*పత్రికా ప్రకటనలు*
———————-






