
–టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: గాంధీల కుటుంబాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రత్యేకంగా టార్గెట్ చేసిందని, నాటి గాడ్సే విధానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నేడు పాటిస్తూ ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికి హుజురాబాద్ పరకాల క్రాస్ రోడ్ నుండి ర్యాలీగా వచ్చి సైదాపూర్ క్రాస్ వద్ద దివంగత మాజీ ఎంపీ వోడితెల రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలు పిసిసి అధ్యక్షుడిని మంత్రిని పెద్ద ఎత్తున గజమాలతో సన్మానించారు. అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై ఈగ వాలిన ఉరుకునేది లేదు! అని హెచ్చరించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక రాజకీయాలు దేశంలో దిగజారిపోతున్నవని ఆరోపించారు. త్యాగ జనుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, నెహ్రూ వేసిన బాటలో నేడు దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చిందని బీజేపీకి అక్కసు వెలగక్కుతున్నారన్నారు. బిజెపి నేతలు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి అనేక విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. తీవ్రవాదుల చేతిలో కుటుంబాన్ని కోల్పోయిన కుటుంబంగా సోనియా రాహుల్ గాంధీ కుటుంబానికి మంచి పేరు ఉందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోడీ ఏందుకు స్పందించడం లేదు ఆయన నిలదీశారు. గాడ్సే విధానాన్ని మోడీ పాటిస్తున్నారు కనుకనే బిజెపి నేతల విమర్శల పరంపర కొనసాగుతుందన్నారు.
బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణా వ్యాప్తంగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టము అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
రాహుల్ గాంధీ మీద ఈగ వాలిన కాంగ్రెస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు సైనికులు వలె ఊరుకునేది లేదు అన్నారు. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మతాన్ని అడ్డుపెట్టుకొని మోడీ ప్రధాని అయ్యారు అని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. శ్రీరాముని పేరిట, హనుమంతుని పేరిట, శివుని పేరిట అధికారంలోకి వచ్చారని, వచ్చే ఎన్నికల వరకు బిజెపికి దేశంలో 100 సంఖ్య కూడా దాటదని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో ఓడిపోతమని బిజెపి భావించి కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీని టార్గెట్ చేశారని ఆయన పేర్కొన్నారు. బిజెపి నేతల తీరును దేశ ప్రజలు యావత్తు హర్శించడం లేదు అన్నారు. జమిలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంధని ఆ విధానాన్ని కొనసాగిస్తాం అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని, మంచి మిత్రున్ని కోల్పోయనని, ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వ్యక్తిగతంగా సమ్మిరెడ్డి చాలా దగ్గర అని, ఇద్దరం ఎన్.ఎస్.యూఐ కార్యకలాపాల్లో పాల్గొన్నామని, గాంధీ భవన్ లో మీడియా ఇంచార్జిగా మరల అవకాశం ఇచ్చే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు , హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్, యస్సి సెల్ మాజీ చైర్మన్ ఆరపెల్లి మోహన్, గూడెపు భాస్కర్ రెడ్డి, టిపిసిసి సభ్యులు పత్తి క్రిష్ణారెడ్డి, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ కుమార్, టి పిసిసి యస్సి సెల్ డిపార్ట్మెంట్ చెర్మన్ తిప్పారపు సంపత్, పిసిసి నాయకుడు ఆవేలీ దామోదర్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోల్లు బాబు, హుజురాబాద్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు యేముల పుష్పలత, జమ్మికుంట పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు పూదరి శివ-రేణుకా, సాయిని రవి, ఎం శ్రీనివాస్, కాజీపేట శ్రీనివాస్, ఖలీద్ హుస్సేన్,యు శ్రీనివాస్ పటేల్, ఇ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.




* పత్రిక ప్రకటనలు*
——————+++++++————–






