
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన తాడూరి కుమారస్వామి s/o రామయ్య (వయస్సు 54 సంవత్సరములు )అనే గీత కార్మికుడు శుక్రవారం తాడిచెట్టు పైనుండి అమాంతంగా పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఛాతి భాగంలో మరియు కడుపులో, భుజంకు తీవ్రంగా గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అందించారు. ఆక్సిజన్ అందకపోవడంతో అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం డాక్టర్ల సూచన మేరకు వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వము సహకరించాలని గ్రామస్తులు కోరారు.

