
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో ఈరోజు పెంచికలపేట గ్రామంWWF-INDIA.BCI నవ క్రాంతి FPCL వారి ఆధ్వర్యంలో లేబర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా ప్రజల నుండి చక్కని స్పందన లభించింది. అందులో భాగంగా లేబర్ కార్డు కలిగిన గ్రామ రైతులకు 23 రకాల రక్త పరీక్షల కొరకు 40 మంది రక్త నమూనాలను సేకరించారు. ఈ రక్తదాన శిబిరానికి రైతుల నుండి చక్కని స్పందన లభించినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీఐ క్షేత్ర సిబ్బంది రఘు, రావుల లత, మౌనికతో పాటు రైతులు పాల్గొన్నారు.






