
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భావితరాలకు వీరనారి చాకలి ఐలమ్మ ఆదర్శమని పలువురు పేర్కొన్నారు. హుజురాబాద్ మునిసిపల్ అధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పలువురు ప్రజా ప్రతినిధులు, రజక, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, కమిషనర్ ఎస్ సమ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర నాయకులు కొలిపాక శ్రీనివాస్, కొండపాక శ్రీనివాస్, నిమ్మటూరి సాయికృష్ణలు హాజరై ముందుగా జయంతి కేక్ కట్ చేసి కేకులు స్వీట్లు పంచిపెట్టారు, ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దొరలపై పోరాడిన ధీశాలి పెత్తందారీ గుండెల్లో గుబులు పుట్టించిన వీరనారి ఐలమ్మ అని, ఆమె పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిందన్నారు. ఎందరికో ప్రేరణగా స్పూర్తిగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగిసిపడేలా చేసిందనీ గుర్తు చేశారు. నీ బాంచన్ కాలు మొక్కుతా అనే బలహీనుల చేత బందూకులు పట్టించిన తల్లి ఐలమ్మ అని అన్నారు. నేటి సమాజం ఆమె స్పూర్తితో పనిచేయాలని, రావాల్సిన హక్కులకై ఉద్యమించాలని ఐలమ్మను చూసి నేర్చుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల- శ్రీనివాస్, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండపాక శ్రీనివాస్, రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య, కొలిపాక శంకర్, నల్ల బాలరాజు, వెంకటేశ్వర్లు, వేల్పుల ప్రభాకర్, వేల్పుల రత్నం, సదానందం, వెంకటస్వామి, కొలిపాక మహేష్, నల్ల సుమన్, పంజాల శ్రీధర్ గౌడ్, నల్ల రాజు, సుంకరి రాజమౌళి, కోలిపాక శ్రీనివాస్, సందీప్, తోపాటు తదితరులు పాల్గొన్నారు.









