
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కనుకులగిద్దె గ్రామంలో రైతు వేదిక కార్యాలయంలో రైతులకు గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షక్ సేవా సమితి ప్రతినిధి వుట్కూరి రాదాక్రిష్ణరెడ్డి హాజరై మాట్లాడుతూ గోవుల యొక్క విశిష్టత తెలియజేశారు. గోవు ఆధారిత వ్యవసాయం వల్ల గోవుల సంతతి పెరగటం తో పాటు నేల ఆరోగ్యం, పంట ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న చొప్పదండి గ్రామ రైతు మల్లికార్జున్ రెడ్డి తన అనుభవ పూర్వకంగా రైతు సోదరులకు క్లుప్తంగా ఆయన అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలియజేశారు. తర్వాత సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి హుజురాబాద్ మండల వ్యవసాయ అధికారి Ch.భూమిరెడ్డి, kvk సేద్య విభాగ శాస్త్రవేత్త విజయ్ తెలిపారు. కార్యక్రమంలో హుజురాబాద్ ఆత్మ చైర్మన్ కంకణాల రమేష్ రెడ్డి, హుజురాబాద్ Aeo నిఖిల్ కుమార్, రైతు సోదరులు పాల్గొన్నారు.







