
Oplus_0
–కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి
వెలిచాల రాజేందర్ రావు
–కట్టరాంపూర్ లో దుర్గాదేవి
విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: సకల జగత్తుకు మూలం దుర్గాదేవి అని, ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరీపై ఉండాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ ఆకాంక్షించారు. గురువారం కరీంనగర్ 11వ డివిజన్ కట్ట రాంపూర్‌లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవీ విగ్రహం వద్ద వెలిచాల రాజేందర్ రావు స్థానిక కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్నతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ దేవీ నవరాత్రోత్స వాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మ వారిని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే బతుకమ్మ సంబురాలను మహిళలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత విగ్రహ కమిటీ నిర్వాహకులు, ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షుడు పిట్టల లింగయ్య, కాంగ్రెస్ నేత తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు కొలకాని నరసయ్య, పిట్టల నరేందర్, కాంగ్రెస్ నాయకులు, భక్తులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
